టాలీవుడ్‌లోని అల్లు వారి ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక నయనికతో ఘనంగా జరిగింది. అక్టోబర్ 31న జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులు హాజరయ్యారు. వారితో పాటు కొందరు సన్నిహితులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.
అయితే, ఈ సందడి వేళ మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల ప్రత్యేక ఆర్షణగా నిలిచారు. వారిద్దరు కలిసి దిగిన ఫోటోను ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత మిస్టర్ సి తో స్పెషల్ ఫోటో దిగే ఛాన్స్ దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.



