ఈ ఏడాదిలో హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్లీన్ అండ్ బ్లాస్టింగ్ హిట్ స్పోర్ట్స్ చిత్రం “ఎఫ్1”. బ్రాడ్ పిట్ కి ఒక మ్యాడ్ కంబ్యాక్ గా నిలిచిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకి పైగా రాబట్టి అదరగొట్టింది. అయితే ఈ సినిమాకి ఇండియన్ వెర్షన్ గా రీమేక్ చేస్తే ఎవరు సూట్ అవుతారు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.
అందులో కోలీవుడ్ స్టార్ అజిత్ పేరు కూడా వచ్చింది. అజిత్ కూడా ఒక ప్రొఫెషనల్ రేసర్ అని అందరికీ తెలిసిందే. బైక్ అయినా కార్ అయినా అజిత్ చాలా రిస్కీ స్టంట్స్ కూడా చేయడం జరిగింది. ఇలా ఎఫ్ 1 లాంటి సినిమా రీమేక్ చేయడంపై తను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
ఎఫ్ 1 స్టైల్ సినిమా చేసే ఛాన్స్ వస్తే డెఫినెట్ గా సిద్ధం అని సినిమా కంటే ఆ స్పోర్ట్ ని ఇక్కడ మరింత అందరికీ చేరువ అయ్యేలా చేసినవాడిని అవుతానని మరోసారి రేసింగ్ పట్ల తనకి ఉన్న మక్కువ హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో తెలిపారు. దీనితో అజిత్ పర్సనాలిటీకి ఇలాంటి సినిమాలు సరిగ్గా సెట్ అవుతాయని ఏ దర్శకుడు ముందుకు వస్తాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


