పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “మాస్ జాతర” కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా దాదాపు పూర్తవుతుంది. అయితే ఈ సినిమాపై ఓ సాలిడ్ బజ్ ఇపుడు వినిపిస్తోంది.
దీని ప్రకారం మేకర్స్ ఈ ఏడాదికి ముగింపుగా ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజికల్ బ్లాస్ట్ తో ముగించనున్నారని వినిపిస్తోంది. అంటే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన ఫస్ట్ సింగిల్ ని డిసెంబర్ 31న మేకర్స్ విడుదల చేయాలని ఫిక్స్ చేశారట. సో ఏడాది ఎండింగ్ కి మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ బీట్స్ తో మోగిపోతుంది అని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ బయటకు రావాల్సి ఉంది.


