‘గర్ల్‌ఫ్రెండ్’లో కాస్ట్లీ సాంగ్.. సినిమాలో మాత్రం ఉండదు..!

‘గర్ల్‌ఫ్రెండ్’లో కాస్ట్లీ సాంగ్.. సినిమాలో మాత్రం ఉండదు..!

Published on Nov 1, 2025 10:01 PM IST

the-Girl-friend

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా నటుడు కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రూపొందించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే, ఈ సినిమా కోసం మేకర్స్ ఓ కాస్ట్లీ సాంగ్‌ను రూపొందించారు. ఈ చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ విషయానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఓ ప్రమోషనల్ సాంగ్ చేద్దామని రాహుల్ రవీంద్రన్ చెప్పాడని.. దీని కోసం తమ టీమ్ ప్లాన్ చేయగా ఖర్చు ఏకంగా కోటి రూపాయలు అయ్యిందని ఆయన తెలిపాడు. అయితే, ముందుగా కమిట్ అయ్యామని ఆ పాటను కంప్లీట్ చేశామని ఆయన చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ సాంగ్ కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే అని.. సినిమాలో లేకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో రష్మిక, దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

తాజా వార్తలు