పెద్ది కోసం బుచ్చిబాబు మాస్టార్ ప్లాన్..?

పెద్ది కోసం బుచ్చిబాబు మాస్టార్ ప్లాన్..?

Published on Nov 1, 2025 8:00 PM IST

Peddi Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వీడియో రూపంలో చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ ఓ పాట రిలీజ్ అనౌన్స్‌మెంట్ కోసం తెలుగులో వీడియో చేసిన సందర్భాలు తక్కువ. ఆయన చిత్ర ప్రమోషన్స్‌లో కూడా పెద్దగా ఆసక్తి చూపరు. మరి పెద్ది సినిమా కోసం ఆయన తన పద్దతి మార్చుకుంటాడా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అచ్చియమ్మ పాత్రలో అందాల భామ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తాజా వార్తలు