మాస్ రాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్‌తో మంచి రెస్పాన్స్ దక్కిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ఈ సినిమా బుక్ మై షోలో ర్యాంప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి బుక్ మై షోలో ఏకంగా 100K కి పైగా టికెట్లు అమ్ముడైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక వీకెండ్ సమయంలో ఈ సినిమాకు మరింత రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
మాస్ రాజా తనదైన మాస్ ప్రెజెన్స్‌తో అల్లాడిస్తుండగా యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ప్రొడ్యూస్ చేశారు.



