రీరిలీజ్ లో కూడా ‘నాన్ బాహుబలి రికార్డ్స్’

రీరిలీజ్ లో కూడా ‘నాన్ బాహుబలి రికార్డ్స్’

Published on Nov 1, 2025 7:02 PM IST

Baahubali The Epic

కొన్నాళ్ల కితం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకో స్టార్ హీరో తమ రికార్డులు బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డులు సెట్ చేసేవారు. కానీ ఎప్పుడైతే రాజమౌళి, ప్రభాస్ ల నుంచి వచ్చిన బాహుబలి వచ్చిందో అక్కడ నుంచి ఈ కొలమానం మారింది. నాన్ బాహుబలి రికార్డులు అంటూ మొదలై ఇప్పటికీ దాదాపుగా అదే కొనసాగుతుంది.

ఇక లేటెస్ట్ గా మొదలైన రీరిలీజ్ ట్రెండ్ లో కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ మొదలయ్యాయి అని చెప్పాలి.ఇండియన్ సినిమా దగ్గర మొత్తం లాంగ్ రన్ లో వచ్చిన సినిమాల తాలూకా వసూళ్లులో దాదాపు 90 శాతం బాహుబలి ది ఎపిక్ కేవలం ఒక్క రోజుల్లోనే అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.

ఊహించినట్టే 20 కోట్ల దగ్గర ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకోగా ఆల్ టైం రికార్డ్ ఓపెనర్ గా ఇప్పుడు రీరిలీజ్ లలో కూడా నాన్ బాహుబలి రికార్డులు పరంపర ఇప్పుడు మొదలైంది అని చెప్పవచ్చు. ఇక ఇది ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

తాజా వార్తలు