పెద్ది: మాస్ అచ్చియమ్మగా జాన్వీ కపూర్.. పల్స్ పట్టేసిన బుచ్చిబాబు

పెద్ది: మాస్ అచ్చియమ్మగా జాన్వీ కపూర్.. పల్స్ పట్టేసిన బుచ్చిబాబు

Published on Nov 1, 2025 3:26 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయనుండగా ఇప్పుడు ఓ సర్ప్రైజ్ దానికంటే ముందు అందించారు.

దీనితో హీరోయిన్ జాన్వీ కపూర్ లుక్ ఇంకా ఆమె రోల్ ని రివీల్ చేసారు. ఈ చిత్రంలో అచ్చియమ్మ అనే రూటెడ్ మాస్ పాత్రలో జాన్వీ కనిపిస్తుంది అని ఆమెపై మంచి గ్లామరస్ పోస్టర్ లతో రివీల్ చేసారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ ని ఇంత నాటుగా పరిచయం చేయడం అనేది పూర్తిగా బుచ్చిబాబు మాస్ అనే చెప్పాలి.

ఇది డెఫినెట్ గా మాస్ ఆడియెన్స్ లో ఇంకా ఉత్తరాంధ్ర ఆడియెన్స్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇక సినిమాలో ఆమె రోల్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు