బైకర్ గ్లింప్స్ : స్టన్నింగ్ కాన్సెప్ట్‌తో రేస్ మొదలుపెట్టిన శర్వా..!

బైకర్ గ్లింప్స్ : స్టన్నింగ్ కాన్సెప్ట్‌తో రేస్ మొదలుపెట్టిన శర్వా..!

Published on Nov 1, 2025 4:52 PM IST

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ప్రస్తుతం పలు కొత్త సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇందులో ‘బైకర్’ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ కూడా ఒకటి. దర్శకుడు అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శర్వా ఓ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ చిత్రం నుండి వీడియో గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘బైకర్’ చిత్రానికి సంబంధించిన నేపథ్యాన్ని మనకు ఇందులో వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమే బైకర్ లక్ష్యం అని మనకు ఈ గ్లింప్స్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమాలో శర్వా పూర్తిగా స్లిమ్ లుక్‌లో స్టన్ చేస్తున్నాడు. మంచి కాన్సె్ప్ట్‌తో పాటు అదిరిపోయే కథనం ఈ సినిమాకు అసెట్‌గా నిలవబోతుందని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోండగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు