‘మాస్ జాతర’ కోసం శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

‘మాస్ జాతర’ కోసం శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Published on Nov 1, 2025 12:00 AM IST

Sreeleela

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడం ఖాయమని మేకర్స్ చెబుతూ వచ్చారు. దీనికి తగ్గట్టుగానే ఆమె ఈ సినిమాను ప్రమోట్ చేసింది. అయితే, ఈ సినిమాలో శ్రీలీల రెమ్యునరేషన్ గురించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.

‘మాస్ జాతర’ సినిమాలో నటించినందుకు శ్రీలీల ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఆమె పాత్ర అభిమానులను ఇంప్రెస్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమాతో శ్రీలీల ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు