‘వార్ 2’లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై కొత్త ట్విస్ట్.!?

‘వార్ 2’లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై కొత్త ట్విస్ట్.!?

Published on Jul 2, 2025 12:05 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇపుడు హీరోగానే కాకుండా యాంటీ హీరోగా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అయాన్ ముఖర్జీతో చేస్తున్న భారీ చిత్రం “వార్ 2” లో హృతిక్ సహా ఎన్టీఆర్ లు సాలిడ్ పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇది వరకే వచ్చిన టీజర్ తో తారక్ ఎలా కనిపిస్తాడు అనే దానిపై ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి వైరల్ గా కనిపిస్తుంది.

తారక్ కూడా ఒక స్పై ఏజెంట్ కాగా తాను భారత్ తరపు నుంచి దారి తప్పిన కబీర్( హృతిక్ రోషన్) ని ఎదుర్కొనే తనకి సమానమైన స్టామినా కలిగిన పవర్ఫుల్ ఏజెంట్ విక్రమ్ గా కనిపిస్తాడట. అయితే ఇది వరకు ఎన్టీఆర్ ఏజెంట్ వీరేంద్ర రఘునాథ్ గా కనిపిస్తాడని టాక్ ఉంది కానీ ఇపుడు విక్రమ్ గా మారింది సో ఇది ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు