మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ కి వచ్చిన టీజర్ కి కొంచెం నెగిటివ్ వచ్చింది.
మరి వీటి విషయంలో కొంచెం కంప్లైంట్స్ రాగా మేకర్స్ దీనిపైనే చాలా ఎక్కువ ఫోకస్ చేసి ఇంత సమయం తీసుకున్నారు. అయితే విశ్వంభర విషయంలో ఈ గ్రాఫిక్స్ కోసం ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. దీనితో హాలీవుడ్ కి చెందిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ వారు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారట. తాము సాలిడ్ అవుట్ పుట్ సినిమాకి అందిస్తున్నారట. అలాగే ఈ పనులు ఒక కొలిక్కి వచ్చాక మాత్రమే రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్ చేస్తారట. మరి మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి ఒక గ్రాండ్ ఎంట్రీ రానుంది అని చెప్పాలి.