ప్రస్తుతం ఇండియన్ సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం వార్ 2 కోసం అందరికీ తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం ఇప్పుడు వార్తల్లో తరచూ వినిపిస్తూ వస్తుంది.
ఇలా మరో ఆసక్తికర రూమర్ ఈ సినిమాపై వినిపిస్తుంది. దీనితో వార్ 2 ప్రమోషన్స్ లో ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి కనిపించడం జరగదట. సినిమాలో ఇద్దరి పాత్రలకి నడుమ వైరంతో ఎలా అయితే కలిసి ఉండరో అదే స్ట్రాటజీ లోనే ఇరు హీరోలు సెపరేట్ సెపరేట్ గానే ప్రమోషన్స్ లో పాల్గొంటారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ఎంతవరకు నిజం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి.