గత కోవిడ్ లాక్ డౌన్ సమయంలోనే ఓటిటిలు ఎంతలా ప్రాచుర్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా లాక్ డౌన్ లో నేరుగా ఓటిటిలోకే వచ్చి సూపర్ హిట్ అయ్యిన సూపర్ హీరో జానర్ చిత్రమే “ది ఓల్డ్ గార్డ్”. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో గత 2020 లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ని ఓటిటి ఆడియెన్స్ లో తెచ్చుకుంది. ఇలా అక్కడ నుంచి ఈ 2025కి సీక్వెల్ ఎట్టకేలకి వచ్చేసింది.
చార్లిజ్ థెరాన్ ప్రధాన పాత్రలో జినా ప్రిన్స్ బైత్ వుడ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఓటిటిలో సెన్సేషన్ సెట్ చేసింది. ఇక దీనికి సీక్వెల్ “ది ఓల్డ్ గార్డ్ 2” నేటి నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈరోజు జూలై 2 మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది. మరి మంచి సాలిడ్ యాక్షన్ తో కూడిన సూపర్ హీరో జానర్ లాంటి సినిమాలు ఇష్టపడే వారు దీనిని చూడొచ్చు. అన్నట్టు ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.