ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 2, 2025
స్ట్రీమింగ్ వేదిక : నెట్ ఫ్లిక్స్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : హెన్రీ గోల్డింగ్, వేరోనికా న్గో, చార్లైజ్ థెరాన్, కికీ లేన్, చివెటెల్ ఎజియోఫర్, ఉమా థెర్మన్, మాత్తియాస్ షోనార్ట్స్, మార్వాన్ కెంజారి, లుకా మారినెల్లి
దర్శకత్వం : విక్టోరియా మహోనీ
నిర్మాతలు : డేవిడ్ ఎల్లిసన్, డానా గోల్డ్‌బర్గ్, డాన్ గ్రాంజర్, చార్లైజ్ థెరాన్, బేథ కోనో, ఏ.జే. డిక్స్, మార్క్ ఇవాన్స్, జినా ప్రిన్స్‑బైథ్వుడ్
సంగీత దర్శకులు: స్టెఫెన్ తమ్, రుత్ బ్యారెట్
సినిమాటోగ్రఫీ : బ్యారీ ఆక్రోయిడ్
సంగీతం : స్టెఫెన్ తమ్, రుత్ బ్యారెట్
ఎడిటర్ : మాథ్యూ శ్మిడ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
లేటెస్ట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన సాలిడ్ కంటెంట్ లో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిన సూపర్ హీరో యాక్షన్ చిత్రం “ది ఓల్డ్ గార్డ్ 2” కూడా ఒకటి. ఐదేళ్ల తర్వాత వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
కారణం తెలీకుండా తన అమరత్వాన్ని యోధురాలు ఆండీ (చార్లిజ్ థెరాన్) కోల్పోతుంది. ఇంకోపక్క తన పాత స్నేహితురాలు క్వాన్హ్ (వాన్ వెరోనికా న్గో) అలాగే మొదటి అమరత్వం కలిగిన డిస్కార్డ్ (ఉమా తుర్మన్) తిరిగి వెనక్కి తీసుకొస్తుంది. అయితే డిస్కార్డ్ ఆలోచనలు మరో విధంగా ఉంటాయి. ఈ క్రమంలో క్వాన్హ్ ని ఆండీకి వ్యతిరేకంగా మార్చాలని డిస్కార్డ్ ప్లాన్ చేసిన మిగిలిన అమరుల గ్రూప్ ని సమూలంగా విచ్చిన్నం చేసేయాలని ప్లాన్ చేస్తుంది. ఇక ఈ గ్రూప్ లోకి నైల్ ఫ్రీమన్ (కికి లేన్) వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? డిస్కార్డ్ అనుకున్న ప్లాన్ సఫలం అయ్యిందా లేదా చివరికి ఈ సినిమా ఎలా ముగిసింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా గత చిత్రాన్ని చూసి ఇష్టపడిన వారికి అలాగే మంచి యాక్షన్ ని కోరుకునేవారికి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ నుంచి సాలిడ్ యాక్షన్ సన్నివేశాలు మంచి వైలెన్స్ ని కోరుకునేవారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
అలాగే మెయిన్ లీడ్ నటి చార్లిజ్ థెరాన్ తన పాత్రలో మరోసారి షైన్ అయ్యారు. కొన్ని కష్టతరమైన సన్నివేశాలని కూడా ఆమె సూపర్బ్ గా పెర్ఫామ్ చేశారు. అలాగే స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన కికి లేన్ తన ప్రెజెన్స్ ఎనర్జిటిక్ తో ఆకట్టుకుంటుంది. అలాగే ఇతర నటీనటులు తమ పాత్రల్లో ఇంప్రెస్ చేస్తారు.
మైనస్ పాయింట్స్:
మొదటి పార్ట్ లో బలమైన అంశాల్లో ఆ సినిమా కథే ప్రధాన బలం కానీ ఊహించని విధంగా పార్ట్ 2 కి అదే మైనస్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ తర్వాత పార్ట్ 2 మొదలు బాగానే అనిపిస్తుంది కానీ నెమ్మదిగా కథనం కొనసాగుతున్న సమయంలో మాత్రం చాలా పలుచగా మారిపోతుంది.
స్ట్రాంగ్ పాయింట్ ఏది లేక రొటీన్ రెగ్యులర్ యాక్షన్ సినిమాగా ఇది అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా కథనం చాలా వరకు ఊహాజనితంగానే అనిపిస్తుంది. సో ఆ థ్రిల్ మూమెంట్స్ కానీ ఎగ్జైటింగ్ మూమెంట్స్ కానీ అంతగా కనిపించవు. అలాగే నటీనటుల ఎంపికపై తగ్గట్టుగా సాలిడ్ పాత్రలు కూడా వారికి లేనట్టు అనిపిస్తాయి.
ఇంకా సరైన ఎమోషన్స్ కూడా కనిపించవు. ఇంకా ఆండీ, బూకర్ వర్క్ ల నడుమ కొన్ని మూమెంట్స్ మధ్యలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. అయితే ఈ సాగదీత అంతా మరో పార్ట్ కోసం లాక్ చేసారని క్లైమాక్స్ వరకు వెళ్ళేదాకా చూసే ఆడియెన్ కి వెలగదు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. యాక్షన్ పార్ట్ ని బాగా తెరకెక్కించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకురాలు విక్టోరియా మహోనీ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాకి కొంచెం వీక్ గానే అనిపిస్తుంది. డీసెంట్ లైన్ ని ఇంకా ఎంగేజింగ్ గా తెరకెక్కించాల్సింది. యాక్షన్ పార్ట్ వరకు ఇంప్రెస్ చేశారు కానీ చాలా సన్నివేశాలు అనవసరంగా సాగదీశారు. కాకపోతే మెయిన్ మేటర్ ని పార్ట్ 3 కి ఉంచుకున్నారు కానీ ఈ గ్యాప్ లో మాత్రం కథనం అంత ఆకట్టుకునే విధంగా నడిపించలేకపోయారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. ఈ “ది ఓల్డ్ గార్డ్ 2” మరీ అంత దారుణంగా లేదు కానీ యాక్షన్ మూవీ లవర్స్ ని పెద్దగా కథతో పని లేదు అనుకునేవారికి ఓకే అనిపిస్తుంది. నటీనటులు బాగా చేశారు, యాక్షన్ పార్ట్ విజువల్స్ కూడా బాగున్నాయి. కాకపోతే కథ, కథనాలు వీక్ గా అనిపిస్తాయి. మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ ని పెట్టి ఉంటే బాగుండేది. మొదటి సినిమా మీకు బాగా నచ్చినట్టు అయితే ఇది కూడా ఓకే అనిపిస్తుంది. సో కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకొని నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team