పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” నుంచి రీసెంట్ గానే వచ్చిన టీజర్ మంచి అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ మరిన్ని సినిమాలు చేస్తుండగా వీటిలో దర్శకుడు హను రాఘవపూడి కలయికలో చేస్తున్న భారీ చిత్రం కూడా ఒకటి.
అయితే ఈ సినిమా కోసమో లేక వేరే సినిమా కోసమో కానీ ప్రభాస్ సిద్ధం చేసిన కొత్త లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాహుబలి కి ముందు ప్రభాస్ లుక్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. మళ్ళీ ఆ లుక్ లో అయితే ప్రభాస్ ఇప్పుడు వరకు కనిపించలేదు. సాహో లో కొన్ని సీన్స్ లో మాత్రం అలా ఉంటాడు. మరి మళ్ళీ ఫైనల్ గా ఇప్పుడు ఆ లుక్ లో తాను కనిపించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇది సందీప్ సినిమా కోసమా లేక హను సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.