‘హరిహర వీరమల్లు’ ట్రైలర్.. పవన్ కోసం మరోసారి అర్జున్ దాస్

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్.. పవన్ కోసం మరోసారి అర్జున్ దాస్

Published on Jul 2, 2025 2:11 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతికృష్ణలు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ఇప్పుడు ఎట్టకేలకి ట్రైలర్ కి వచ్చింది.

ఇక ఈ ట్రైలర్ చూసి పవన్ ఆనందం వ్యక్తం చేయగా రేపు గ్రాండ్ గా ట్రైలర్ రాబోతుంది. అయితే దీనికి ముందు మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది. దీనితో ఈ ట్రైలర్ ని ప్రముఖ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది వరకే పవన్ ఓజి గ్లింప్స్ కే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో చెప్పించగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మళ్ళీ వీరమల్లు ట్రైలర్ కి అయితే బ్లాస్టే అని చెప్పవచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు