ఆ నటుడితో బాహుబలి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..!

ఆ నటుడితో బాహుబలి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..!

Published on Nov 1, 2025 2:30 AM IST

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తెలుగులోనూ తనదైన యాక్టింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించే సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇక పుష్ప, పుష్ప 2 సినిమాల్లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ మాంచి ఇంప్రెషన్ అందుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ యాక్టర్ తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా మారాడు.

బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఫహద్ ఫాజిల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ సినిమా ఆన్‌సెట్స్‌లో ఉండగా, అది పూర్తయ్యాక మరో సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఆర్కా మీడియా నుండి వస్తున్న సినిమాలు కావడంతో ఫహద్‌కు సాలిడ్ పాత్రలు పడి ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

మరి ఫహద్ ఫాజిల్ ఈ రెండు సినిమాలతో టాలీవుడ్‌లో కూడా బిజీ యాక్టర్ అవుతాడేమో చూడాలి.

తాజా వార్తలు