డిసెంబర్ కి వాయిదా పడ్డ ఎటో వెళ్లిపోయింది మనసు

డిసెంబర్ కి వాయిదా పడ్డ ఎటో వెళ్లిపోయింది మనసు

Published on Oct 28, 2012 3:57 AM IST


గౌతం మీనన్ రానున్న చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు” విడుదల డిసెంబర్ మధ్యకి వాయిదా పడింది. గతంలో ఈ చిత్రం నవంబర్ చివరి వారం కాని డిసెంబర్ మొదటి వారం కాని విడుదల కానుంది అని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని గౌతం మీనన్ తెలుగు మరియు తమిళంలో డిసెంబర్ 14న విడుదల చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో నాని మరియు సమంత ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది త్వరలో ఈ చిత్ర ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు సి కళ్యాణ్ తెలుగు వెర్షన్ ని తేజ సినిమా బ్యానర్ మీద నిర్మించారు.

తాజా వార్తలు