థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!

థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!

Published on Sep 8, 2025 3:01 PM IST

ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అటు ఓటీటీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేసే సినిమాలు కూడా బోలెడున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర రెండు బజ్ ఉన్న చిత్రాలు పోటీ పడుతున్నాయి. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూపర్ యోధుడిగా తేజ కనిపిస్తున్నాడు. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక హార్రర్ జోనర్‌లో తెరకెక్కిన ‘కిష్కంధపురి’ ప్రేక్షకులను భయపెట్టేందుకు సెప్టెంబర్ 12న రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి హారర్ కంటెంట్‌తో ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం ‘టన్నెల్’ కూడా ఈ వారం రిలీజ్ కానుంది. అథర్వ మురళీ హీరోగా నటించిన ఈ సినిమాను రవీంద్ర మాధవన్ డైరెక్ట్ చేశారు.

ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి.

సైయారా – సెప్టెంబర్ 12 (నెట్‌ఫ్లిక్స్)
ది గర్ల్‌ఫ్రెండ్ (వెబ్ సిరీస్ ) – సెప్టెంబర్ 10 (అమెజాన్ ప్రైమ్)
కూలీ – సెప్టెంబర్ 11 (అమెజాన్ ప్రైమ్)
డూ యు వన్నా పార్ట్నర్ (హిందీ) – సెప్టెంబర్ 12 (అమెజాన్ ప్రైమ్)
బకాసుర రెస్టారెంట్ – సెప్టెంబర్ 12 (అమెజాన్ ప్రైమ్ – సన్ NXT)
సు ఫ్రమ్ సో – సెప్టెంబర్ 9 (జియో హాట్‌స్టార్)
రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 12 (జియో హాట్ స్టార్)

తాజా వార్తలు