యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ కోసం ఇప్పటికే సాలిడ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా మరోసారి తనదైన యాక్షన్‌తో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులోని యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారు.
ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.