బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!

బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు..!

Published on Sep 8, 2025 7:00 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ను బాలయ్య తాజాగా సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ గంట మోగించారు బాలయ్య. ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న దక్షిణ భారత తొలి నటుడిగా బాలయ్య నిలిచాడు.

నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఈ గంట మోగించే అవకాశం సాధారణంగా ఇండస్ట్రీ దిగ్గజాలకు, రాజకీయ నేతలకు దక్కుతుంది. ఇక బాలయ్య తన తల్లి బసవతారకం పేరిట స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన రోగులకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి NSE లో గంట మోగించిన తొలి నటుడుగా బాలయ్య మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మెంబర్స్ కూడా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు