టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు పెద్ద విజయాన్ని అందుకునే దిశగా వెళ్తోంది. మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నాగరం హీరోహీరోయిన్‌గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా ‘#90s’ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేశారు. ఇక యూత్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.
ఈ చిత్రానికి తొలిరోజే మంచి టాక్ దక్కింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రూ.2కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా రూ.12.21 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక మండే కూడా టికెట్ బుకింగ్స్ బాగానే అవుతున్నాయని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాలో రాజీవ్ కనకాల, జై కృష్ణ, ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్యకృష్ణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు.