పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఓజి’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా, ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నారు. ఈ చిత్ర బ్యాక్‌గ్రౌండ్ రికార్డింగ్ వర్క్ శరవేగంగా జరుగుతుందని.. లండన్‌లోని అబ్బీ రోడ్ స్టూడియోస్‌లో 117 మంది మ్యూజిషియన్స్‌తో ఈ రికార్డింగ్ వర్క్ జరుగుతున్నట్లు థమన్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో ఈ సినిమా మ్యూజిక్ కోసం థమన్ డెడికేషన్ సూపర్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.