నటుడిగా మెప్పిస్తేనే స్టార్.!

నటుడిగా మెప్పిస్తేనే స్టార్.!

Published on Oct 29, 2012 5:04 PM IST


టాలీవుడ్ యంగ్ హంక్ రానా దగ్గుబాటి స్టార్ మరియు నటులు ఇద్దరూ వేరు వేరు అంటే నేను నమ్మను. ఈ విషయం పై రానా మాట్లాడుతూ ‘ అందరూ స్టార్ మరియు నటుడు వీరిద్దరూ వేరు వేరు అని అంటూ ఉంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు ఒకరు స్టార్ అవ్వాలంటే దానికి ముందు అతను నటుడిగా ఎన్నో మైలురాళ్ళని దాటుకొని రావాలి. మీలో ఉన్న నటుడు నచ్చితేనే ప్రేక్షకులు నిన్ను స్టార్ ని చేస్తారు. ప్రస్తుతం నేను అదే స్టేజ్ లో ఉన్నారు, ఒక నటుడిగా ఏమేమి నేర్చుకోవాలో అవి నేర్చుకుంటున్నానని’ ఆయన అన్నారు. రానా బి.టెక్ బాబుగా చేసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా దీపావళి కానుకగా ప్రేకషకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నయనతార కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

తాజా వార్తలు