అక్టోబర్ 29న రానున్న తుపాకి ఆడియో?

అక్టోబర్ 29న రానున్న తుపాకి ఆడియో?

Published on Oct 27, 2012 10:20 PM IST


విజయ్,కాజల్ ప్రధాన పాత్రలలో వస్తున్న “తుపాకి” నవంబర్ 9న భారీ విడుదలకు సిద్దమయ్యింది. తమిళంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం తెలుగులోకి శోభారాణి ఎస్వీఆర్ మీడియా మీద అనువదించారు. ఈ చిత్రం అనువాద హక్కుల కోసం భారీ మొత్తం చెల్లించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియోని అక్టోబర్ 29న విడుదల చెయ్యనున్నారు. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ మధ్యనే విడుదల అయిన ఈ చిత్రం తమిళ ట్రైలర్ అద్భుతమయిన స్పందన సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలా భాగం ముంబైలో చిత్రీకరించారు.”బిల్లా 2″ చిత్రంలో విలన్ గా కనిపించిన విద్యుత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగులో విజయ్ ఇంతవరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చెయ్యలేదు శంకర్ దర్శకత్వంలో వచ్చిన “స్నేహితుడు” చిత్రం కూడా ఇక్కడ దారుణంగా పరాజయం పొందింది. “తుపాకి” చిత్రంతో అయినా విజయ్ విజయం దక్కించుకుంటాడో లేదో చూడాలి మరి.

తాజా వార్తలు