పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మంచి అంచనాలు ఉన్న ఈ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో కొనసాగుతుంది. అయితే మొన్ననే క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓ క్రేజీ సాంగ్ షూట్ లో ఉంది. అయితే ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఇప్పుడు వినిపిస్తుంది.
టాలీవుడ్ ప్రముఖులు ఈ స్పెషల్ సాంగ్ పవన్ కెరీర్ లో మరింత ప్రత్యేకం అని అంటున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ ని మంచి సెలబ్రేషన్ సాంగ్ లా అంటే వాతి కమింగ్, ఆలుమా డోలుమా తరహాలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా దీనికి పవన్ వేసే స్టెప్పులు కూడా అదిరాయని వినిపిస్తోంది. మొత్తానికి మాత్రం మేకర్స్ ఏదో గట్టిగానే పవన్ తో ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ అవైటెడ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.