రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ ఏమైనట్టు?

కన్నడ స్టార్ నటుడు అలాగే దర్శకుడు కూడా అయినటువంటి రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార 1 ఇప్పుడు విడుదలకి సిద్ధం అవుతుంది. అయితే రిషబ్ హీరోగా పాన్ ఇండియా భాషల్లో బిజీగా ఉన్నారు. ఇందులో రెండు సినిమాలు తెలుగు నుంచే ఉన్నాయి. నిన్ననే సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ భారీ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ అయ్యింది.

కానీ దీనికి ముందే అనౌన్స్ అయ్యిన జై హనుమాన్ పరిస్థితి ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా 2025 రిలీజ్ కే మొదట అనౌన్స్ చేశారు కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. పైగా రిషబ్ కూడా తన కాంతార, తన హిందీ ప్రాజెక్ట్ ల పైనే కనిపించారు.

ఇప్పుడు తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేసేసారు కానీ జై హనుమాన్ ఏమవుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. మరి టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాప కింద నీరులా సైలెంట్ గా కంప్లీట్ చేసేసాడా ఏంటి అనేది ఓ అఫీషియల్ క్లారిటీ ఈ క్రేజీ సీక్వెల్ కోసం చూస్తున్న అభిమానులకి అయినా రివీల్ చేస్తే బాగుంటుంది.

Exit mobile version