‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?

Kingdom

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా కింగ్డమ్ ఎట్టకేలకు రిలీజ్ కి వచ్చింది. పలుమార్లు వాయిదా పడ్డప్పటికీ భారీ అంచనాలు ఈ సినిమా విషయంలో చెక్కు చెదరలేదు. ఇలా భారీ బుకింగ్స్ ని కూడా సొంతం చేసుకొని వరల్డ్ వైడ్ పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ చిత్రం డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ తెలుస్తోంది.

ఈ సినిమా ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఒక రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు అందుకుంటుంది అని తెలుస్తోంది. ఈజీగా 30 కోట్లకి పైగానే 40 కోట్ల మేర ఓపెనింగ్స్ గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ట్రేడ్ వర్గాల్లో ట్రెండ్ చెబుతుంది. కింగ్డమ్ తో మాత్రం విజయ్ ఒక కొత్త నెంబర్స్ ని సెట్ చేయబోతున్నాడని మాత్రం చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించారు.

Exit mobile version