‘వార్ 2’ నుంచి ఇంప్రెసివ్ గా ఫస్ట్ సింగిల్!

బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రమే “వార్ 2”. మంచి హైప్ ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఎట్టకేలకి మొదటి పాటని విడుదల చేశారు. హృతిక్, కియారా లపై సాగే ఈ సాంగ్ ని నేడు కియారా బర్త్ డే ట్రీట్ గా విడుదల చేశారు. అయితే ఇది తన ఫ్యాన్స్ కి నిజంగానే ట్రీట్ అని చెప్పాలి.

సాంగ్ వినేందుకు ఇంపుగా క్లీన్ మెలోడీ బీట్స్ తో ఉంటే హృతిక్, కియారాల కెమిస్ట్రీ కూడా సినిమాలో చాలా బాగా కనిపిస్తుంది. ఇక దీనితో పాటుగా మధ్యలో కియారా డామినేషన్ మాత్రం అదిరింది అని చెప్పాల్సిందే. ఆ మధ్య టీజర్ లో కియారా ఎలా అయితే ఒక సర్ప్రైజ్ ప్యాక్ గా నిలిచిందో అలానే ఈ సాంగ్ లో కూడా తన హాట్ షోతో అలరించింది అని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం వార్ 2 ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని మేకర్స్ ఇపుడు వదిలారు.

Exit mobile version