‘ఓజి’ మొదటి సాంగ్ కి డేట్ ఇదేనా!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “ఓజి”. దీనిపై హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ మ్యూజికల్ బ్లాస్ట్ ని సిద్ధం చేస్తున్నారు. దీనితో ఓజి సినిమా మొదటి పాటని సిద్ధం చేస్తుండగా దీనిపై అనౌన్సమెంట్ ఈ వీకెండ్ లోనే ఇవ్వనున్నట్టుగా వినిపిస్తుంది.

ఇక దీనితోనే ఒక కొత్త పోస్టర్ సహా డేట్ ని అనౌన్స్ చేస్తారట. ఇక డేట్ విషయానికి వస్తే ఈ ఆగస్ట్ 3న లేదా 5న అవైటెడ్ ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్ సాంగ్ ని విడుదల చేస్తారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version