గ్లోబల్ స్టార్ చేయాల్సిన కథే ‘కింగ్డమ్’? నిర్మాత క్లారిటీ

Kingdom

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రం “పెద్ది”. ఇది తన కెరీర్ 16వ సినిమా కాగా ఇది కాకుండా తన కెరీర్ 17వ సినిమాగా దర్శకుడు సుకుమార్ తో బిగ్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. అయితే తన లైనప్ లో మిస్ అయ్యిన ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ మాత్రం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో అని చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు గట్టి హైప్ సెట్ అయ్యింది.

కానీ తర్వాత సినిమా నిలిచిపోయింది. ఆ తర్వాత గౌతమ్ విజయ్ దేవరకొండతో కింగ్డమ్ అనౌన్స్ చేయగా ఈ కథే చరణ్ కి చెప్పింది అంటూ ఓ టాక్ ఇప్పటికీ ఉంది. కానీ దీనిపై ఫైనల్ గా కింగ్డమ్ నిర్మాత అసలు క్లారిటీ ఇచ్చారు. గౌతమ్ రామ్ చరణ్ కి చెప్పిన కథ పూర్తిగా వేరు అది ఆ చాప్టర్ అయ్యిపోయింది. కింగ్డమ్ తో సంబంధం లేదని కన్ఫర్మ్ చేసేసారు. సో ఆ సినిమా వేరు ఈ సినిమా వేరని చెప్పాలి.

Exit mobile version