అప్పుడే ఎన్.టి.ఆర్ కోసం ట్యూన్స్ రెడీ చేస్తున్న తమన్

అప్పుడే ఎన్.టి.ఆర్ కోసం ట్యూన్స్ రెడీ చేస్తున్న తమన్

Published on Oct 26, 2012 8:34 AM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమా ఇటీవలే లాంచనంగా ప్రారంభమైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంబందించిన ట్యూన్స్ కోసం అప్పుడే పని మొదలు పెట్టారు. సినిమాలో మంచి సాంగ్స్ రావాలనే ఉద్దేశంతో ప్రస్తుతం హరీష్ శంకర్ – తమన్ కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సమంతని తీసుకోవాలని చూస్తున్నారు కానీ అది ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్ర టైటిల్ కూడా ఇంకా తెలియజేయలేదు, ఈ రెండు విషయాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. గతంలో ఎన్.టి.ఆర్, దిల్ రాజు, తమన్ మరియు చోటా కె నాయుడు కాంబినేషన్లో ‘బృందావనం’ సినిమా వచ్చింది. మళ్ళీ అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ హరీష్ శంకర్ తోడవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు