బాలీవుడ్లో మరో చిత్రం చెయ్యనున్న తమన్నా

బాలీవుడ్లో మరో చిత్రం చెయ్యనున్న తమన్నా

Published on Oct 26, 2012 3:48 PM IST


తమన్నా హిందీలో రెండవ చిత్రాన్ని చెయ్యడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ సరసన “హిమ్మత్ వాలా” చిత్రంలో నటిస్తున్న తమన్నా ఇప్పుడు మరో చిత్రంలోకనిపించనుంది. జాకి ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ సరసన ఈ భామ నటించనుంది. “హీరోపంటి” అనే పేరుతో తెరకేక్కబోతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. సబ్బిర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. తెలుగు మరియు తమిళంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉండటమే తమన్నాకి బాలివుడ్లో మంచి అవకాశాలు రావడానికి కారణం. హిమ్మత్ వాలా రీమేక్ చిత్రంలో శ్రీదేవి పాత్రను పోషిస్తున్న ఈ భామ ఈ చిత్రం హిట్ అయితే బాలివ్డ్లో భారీ చిత్రాలను కైవశం చేసుకోనుంది.తెలుగులో త్వరలో ఈ భామ వెట్టై చిత్రం రీమేక్లో నాగ చైతన్య సరసన కనిపించనుంది.

తాజా వార్తలు