తాప్సీ కోరిక నెరవేరేనా?

తాప్సీ కోరిక నెరవేరేనా?

Published on Oct 28, 2012 8:31 PM IST


తన అందం మరియు అభినయంతో తెలుగు వారిని ఆకట్టుకున్న ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ కి తెలుగులో ఇంతవరకూ చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ లేదు. తను నటించిన తెలుగు సినిమాల్లో ఒకే ఒక్క ‘Mr. పర్ ఫెక్ట్’ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. ప్రస్తుతం తాప్సీ ‘గుండెల్లో గోదారి’, ‘షాడో’, చంద్ర శేకర్ యేలేటి సినిమా మరియు అజిత్ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాల్లో ఎదో ఒకటి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే తన కెరీర్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఇటీవలే తాప్సీ చెన్నైలో మీడియాతో మాట్లాడినప్పుడు ‘నాకు చాలెంజింగ్ పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరియు శారీరక లోపాలున్నా పాత్రలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని’ తన మదిలోని కోరికను బయటపెట్టింది. తాప్సీ ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ఒక గ్రామ యువతిగా నటించింది, తన తోటి నటీనటులు ఆమె నటనను చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ గ్లామర్ డాల్ చెప్పిన మాటలు విని తనకు అలాంటి పాత్రలు ఎవరన్నా ఇస్తారేమో వేచి చూడాలి.

తాజా వార్తలు