సూర్య – గౌతమ్ మీనన్ కాంబినేషన్లో మరో సినిమా

సూర్య – గౌతమ్ మీనన్ కాంబినేషన్లో మరో సినిమా

Published on Oct 27, 2012 9:28 AM IST

తమిళ నటుడు సూర్య, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ఘర్షణ), ‘వారణం ఆయిరం’ (తెలుగులో సూర్య సన్ అఫ్ కృష్ణన్) సినిమాల తరువాత మళ్లీ వారి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ఈ విషయం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ కొద్ది నెలల క్రితం ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘తుప్పరియుం ఆనందన్’ అనే టైటిల్ ఖరారు చేసారు. 1930లో మద్రాసులో జరిగిన వరుస హత్యల నేపధ్యంలో ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ పాత్రలో సూర్య కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంభందించి మిగతా నటీనటులని ఇంకా ఖరారు చేయలేదు. సూర్య ప్రస్తుతం సింగం (యముడు) సీక్వెల్ ‘సింగం 2’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత వచ్చే ఏడాది గౌతమ్ మీనన్ సినిమా ప్రారంభమవుతుంది.

తాజా వార్తలు