నవంబర్ 1న విడుదల కానున్న శ్రీకాంత్ “లక్కి”

నవంబర్ 1న విడుదల కానున్న శ్రీకాంత్ “లక్కి”

Published on Oct 27, 2012 11:55 PM IST


శ్రీకాంత్ రాబోతున్న చిత్రం “లక్కి” నవంబర్ 1న విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంలో మేఘనరాజ్ కథానాయికగా నటించారు. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజరాజేశ్వరీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం ఒక అబ్బాయిని కలిసాక జీవితం మొత్తం మారిపోయిన అమ్మాయి గురించి ఉంటుంది. ఆమెకు అతని మీద ప్రేమ పుట్టగానే అతడు ప్రేమని నమ్మే మనిషి కాదని తెలుస్తుంది తరువాత ఎం జరిగింది అన్నదే కథ. ఈ చిత్ర ఆడియో ఇప్పటికే విడుదల అయ్యింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ఒక పాటను పాడటం విశేషం. ఇదిలా ఉండగా శ్రీకాంత్ శ్రీ కృష్ణ దేవరాయల కథలో తెలియని కోణాన్ని ఆవిష్కరిస్తూ చేస్తున్న చిత్రం “దేవరాయ” మరియు “శత్రువు” అనే చిత్రాలలో నటిస్తున్నారు.

తాజా వార్తలు