పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విరూపాక్ష అనే క్లాస్సి టైటిల్ ప్రచారంలో ఉండగా నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. మొఘలుల కాలం నాటి ఓ బందిపోటు కథగా ఈ చిత్రం ఉండనుందని టాలీవుడ్ టాక్. ఐతే ఈ చిత్రంలో ఓ పాపులర్ తమిళ్ హీరో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. హీరో శివ కార్తికేయన్ ఈ మూవీలో ఓ కీలక రోల్ కోసం తీసుకోనున్నారట. దీనిపై ఇప్పటికే ఒప్పందం పూర్తి అయ్యిందని సమాచారం.
ఇక ఈ మూవీలో ప్రధాన హీరోయిన్స్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్విలిన్ మరియు నివేదా పెతు రాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. క్రిష్ ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టడం జరిగింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ చిత్రీకరణ త్వరలో మళ్ళీ ప్రారంభం కానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.