ఆ డైరెక్టర్‌తో నాని మరోసారి చేతులు కలుపుతాడా..?

ఆ డైరెక్టర్‌తో నాని మరోసారి చేతులు కలుపుతాడా..?

Published on Aug 1, 2025 1:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ అనే సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో నాని మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, తన కెరీర్‌లో ఫీల్ గుడ్ చిత్రాన్ని అందించిన దర్శకుడితో మరోసారి చేతులు కలిపేందుకు నాని రెడీ అవుతున్నాడు.

నాని కెరీర్‌లో ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ కాంబోలో నెక్స్ట్ రాబోయే సినిమా మాస్ కంటెంట్‌తో రాబోతుందని తెలుస్తోంది.

ఈసారి నాని కోసం శౌర్యువ్ కూడా చాలా పకడ్బందీగా కథను రాశాడని.. ఈ కథతో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు