సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘మహావతార్ నరసింహా’.. తెలుగులో పట్టం కడుతున్న ప్రేక్షకులు

సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘మహావతార్ నరసింహా’.. తెలుగులో పట్టం కడుతున్న ప్రేక్షకులు

Published on Jul 31, 2025 6:53 PM IST

mahavatara-narasimha

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చిన రీసెంట్ డివోషనల్ యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయగా, దీనికి అన్ని భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది.

ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా తక్కువ అంచనాలతో రిలీజ్ అయినా, మహావతార్ నరసింహా సాలిడ్ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. వీరమల్లు లాంటి సినిమా పోటీలో ఉన్నప్పటికీ, ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఈ సినిమా 5 రోజుల్లో ఏకంగా రూ.3 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.

ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నా, ఈ చిత్రం తన హవా కొనసాగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా టోటల్ రన్‌లో రూ.8 కోట్ల మేర వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ బ్యానర్ తెలుగులో రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు