సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా

సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా

Published on Aug 1, 2025 3:04 AM IST

Kingdom

విడుదల తేదీ : జూలై 31, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకీటేష్, అయ్యప్ప శర్మ, బాబు రాజు, కసిరెడ్డి రాజ్ కుమార్ తదితరులు
దర్శకుడు : గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం : అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరం, జోమన్ టి జాన్
ఎడిటింగ్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “కింగ్డమ్”. విజయ్ కి కంబ్యాక్ సినిమాగా నిలుస్తుంది అని ఆశిస్తున్న అభిమానులుతో పాటుగా ఇతర ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. మరి వాటిని ఈ సినిమా అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

1920 సమయంలో శ్రీకాకుళం తీర ప్రాంతం వద్ద ఉండే ఒక తెగ ఆ తెగ నాయకుడు (?) బ్రిటిష్ పాలకులు తమ దగ్గర ఉన్న విలువైన ఖనిజం కోసం దాడి చేస్తారు. ఆ సమయంలో తన ప్రజల కోసం నిలబడి ప్రాణాలు వదిలేస్తాడు. మళ్లీ అక్కడ నుంచి ఆ తెగ తమ కొత్త నాయకుడు రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తర్వాత 91 సమయంలో అంకాపూర్ స్టేషన్ లో చిన్నపాటి కానిస్టేబుల్ అయిన సూరి (విజయ్ దేవరకొండ)కి ఒక ఆపరేషన్ ఇండియన్ స్పై ఏజెన్సీ ఇస్తారు. అయితే తన చిన్నతనంలోనే ఓ కారణం చేత దూరమైన తన ప్రాణానికి ప్రాణమైన అన్న శివ (సత్యదేవ్) ఉన్నాడనే ఒక్క కారణంతో ఒప్పుకున్న సూరి తన అన్న ఉన్న ప్రాంతానికి వెళ్ళాక ఏమైంది? తన అన్న ఉన్న ప్రాంత ప్రజలు ఎవరు? సూరి వారికి అండగా నిలబడే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి. తన అన్నయ్యని వెనక్కి తీసుకోచ్చుకున్నాడా లేదా? ఆ ప్రాంత ప్రజలు ఎవరు? తమ కోరిక ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి మొదటి ప్లస్ విజయ్ నే అని చెప్పాలి. తన నుంచి ఫ్యాన్స్ వరకు మాత్రం మంచి ట్రీట్ లభిస్తుంది. తన పాత్ర కోసం విజయ్ తనని తాను ఆవిష్కరించుకున్న విధానం బాగుంది. తన లుక్స్ పరంగా కానీ బాడీ లాంగ్వేజ్ పరంగా గాని విజయ్ కొత్తగా కనిపిస్తాడు. సత్యదేవ్ తో కొన్ని సీన్స్ లో తన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో విజయ్ మెప్పిస్తాడు. ఇక యాక్షన్ సీన్స్ మరియు కొన్ని ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాయి. ముఖ్యంగా వారియర్ షేడ్ లో విజయ్ అదిరిపోయాడు.

ఇక మరో నటుడు సత్యదేవ్ కి కూడా మంచి రోల్ సినిమాలో దక్కింది. తన పాత్రలో సత్యదేవ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి ఇంప్రెస్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లో పార్ట్ 2 కి ఇచ్చుకునే లీడ్ బాగుంది. ఇది ఫ్యాన్స్ వరకు ఎగ్జైట్ చేస్తుంది. అలాగే విలన్ రోల్ లో వెంకిటేష్ బాగా చేసాడు. సాలిడ్ విలనిజాన్ని తను ప్రదర్శించాడు.

మైనస్ పాయింట్స్:

అప్పట్లో మగధీర సినిమా చూసి కొన్ని కొన్ని సినిమాలు చూసి పుట్టుకొచ్చినట్టు ఇప్పుడు ట్రెండ్ లో కేజీఎఫ్ చూసి మరికొన్ని వస్తున్నాయి. అలాంటి కోవ లోనే ఈ కింగ్డమ్ కూడా చేరుతుంది అని చెప్పవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించే అంశం ఏంటంటే.. ఆ రెండు జనార్ సినిమాలూ కలిపితే పుట్టిందే ఈ కింగ్డమ్ అన్నట్టు అనిపిస్తుంది.

వీటితో ముఖ్యంగా గౌతమ్ లాంటి దర్శకుడు నుంచి ఒక కొత్తదనం కోరుకునే కామన్ ఆడియెన్ నిరాశ చెందుతాడు. విజయ్ ఫ్యాన్స్ వరకు కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించవచ్చు కానీ మిగతా ఆడియెన్స్ కి కనిపించే కథనం ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. ఆ మిగతా సినిమాలు ఇది వరకే చూసేసిన ప్రభావమో ఏమో కానీ వాటి మూలాన ఈ సినిమాలో ఎలిమెంట్స్ అందరికీ ఎక్కకపోవచ్చు.

అయితే వాటికి బాగా ప్లస్ అయ్యి ఇందులో వర్కౌట్ కానీ అంశం ఏదన్నా ఉంది అంటే సరైన ఎమోషన్స్ కూడా లేకపోవడం. హీరో పాత్ర తన అన్న కోసం ఎంతవరకు అయిన తెగించే స్వభావం ఇద్దరి నడుమ డ్రామా తప్పితే మిగతా సినిమాలో పెద్దగా ఎక్కడా ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు.

అలాగే దివి అనే ప్రాంతంలో ఆడవాళ్లు కనే మగబిడ్డలని చూసే వీలు లేదు అంటారు కానీ అదే ప్రాంతంలో ఇతర కుటుంబాల్లో మగపిల్లలు కనిపిస్తారు. సత్యదేవ్ కొడుకు కూడా తన తల్లి తోనే ఉంటాడు. ఇదేం లాజిక్ అర్ధం కాలేదు.

అలాగే ఇండియన్ స్పై ఏజెన్సీలో జే పీ తను పంపించే స్పైలు ఏమైపోయినా పర్లేదు అనుకుంటాడు బాగానే ఉంది. కానీ తనకున్న కారణం అంత బలంగా ఏమి అనిపించదు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కి కూడా సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. ఇంకా అనిరుద్ సంగీతం నుంచి బాగా ఆశించిన వారికీ నిరాశే మిగులుతుంది. చాలా సీన్స్ లో తన బీట్స్ తన పాత సినిమాలకి కొట్టినట్టే ఉంటుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. మేకర్స్ పెట్టిన డబ్బులు, సెట్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి కావాల్సినట్టుగా కనిపిస్తుంది. అనిరుద్ స్కోర్ మెయిన్ థీమ్ బాగుంది. మిగతా స్కోర్ అంతగా లేదు. గిరీష్ గంగాధరం అలాగే జోమన్ టి జాన్ లు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో సాంగ్ కూడా కట్ చేసి మంచి పని చేసారు. లేదంటే కథనం మీద ఇంపాక్ట్ పడేది.

ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విషయానికి వస్తే.. ఈ సినిమాకి కేవలం గౌతమ్ మీదే ఆశలు పెట్టుకొని చూసేవారు మాత్రం ఒకింత డిజప్పాయింట్ అవుతారు. తన నుంచి మంచి క్లాసిక్ సినిమాలు ఫ్రెష్ కథలు చూసినవారికి కింగ్డమ్ అంత రుచించకపోవచ్చు. చాలా రొటీన్ లైన్ అండ్ కథనాలు తను నడిపించారు. అలాగే ఎమోషన్స్ ని కూడా బలంగా చూపించలేదు. కింగ్డమ్ ని నిర్మించే ప్రయత్నంలో ఎంగేజ్ చేసే అంశాలు బలంగా రాసుకోలేదు. సెకండ్ పార్ట్ లో బలమైన ఘర్షణ కోసం పార్ట్ ని సోసో గానే నడిపించేసినట్టు అనిపిస్తుంది. సో తన నుంచి కింగ్డమ్ మాత్రం తను సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ అనిపించదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కింగ్డమ్” లో విజయ్ దేవరకొండ మరోసారి తన సిన్సియర్ పెర్ఫామర్ ని ప్రదర్శించాడు. అలాగే తనపై కొన్ని సీన్స్ ఫ్యాన్స్ వరకు బాగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కానీ మొదటి నుంచీ అంచనాలు పెట్టుకునేవారికి మాత్రం కొంచెం నిరాశ తప్పదు. సో తక్కువ అంచనాలు పెట్టుకొని సినిమా ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు