రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ నేడు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.
ఈ చిత్రాన్ని అమెరికాలో భారీ ప్రీమియర్స్ వేశారు. దీంతో ఈ సినిమా తాజాగా నార్త్ అమెరికాలో ఏకంగా 1 మిలియన్ డాలర్ గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇంత తక్కువ సమయంలో మిలియన్ మార్క్ టచ్ చేయడంతో, ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.