ఘాటి అప్పుడు కూడా డౌటేనా.. నెక్స్ట్ రిలీజ్ డేట్‌పై సర్వత్రా ఆసక్తి!

ఘాటి అప్పుడు కూడా డౌటేనా.. నెక్స్ట్ రిలీజ్ డేట్‌పై సర్వత్రా ఆసక్తి!

Published on Aug 1, 2025 12:01 AM IST

ghaatii
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఘాటి’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో గ్రాండ్ రిలీజ్ చేస్తారనే బజ్ సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

కానీ, ఇప్పుడు ఈ డేట్‌లో కూడా ఘాటి రిలీజ్ కాదని చిత్ర వర్గాల ఇన్‌సైడ్ టాక్. తొలుత సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా, ఆ రోజున మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను పోటీలో దింపకూడదని వారు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్, నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఖాళీగా ఉన్న స్లాట్‌ను చూసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

ఈ సినిమాలో అనుష్క తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపేడయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను యూవి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఘాటి చిత్రం తన రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు