తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, బొద్దు గుమ్ము నిత్యా మీనన్ జంటగా నటించిన రీసెంట్ మూవీ ‘తలైవన్ తలైవీ’ తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఇప్పుడు ‘సార్ మేడమ్’ అనే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో.. ఈ చిత్రానికి బిగ్ బూస్ట్ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. తాను ‘సార్ మేడమ్’ చిత్ర ట్రైలర్ చూశానని.. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అవుతుందని.. చిత్ర యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ అంటూ ఆయన తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు.
నిజంగా ఇది ‘సార్ మేడమ్’ చిత్రానికి సాలిడ్ బూస్ట్ అని చెప్పాలి. భార్య భర్తల మధ్య వచ్చే మనస్పర్థల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. అనేది ఈ సినిమా కథగా చూపించనున్నారు. ఈ సినిమాను పాండిరాజ్ డైరెక్ట్ చేయగా యోగి బాబు కీలక పాత్రలో నటించాడు.