మళ్ళీ జతకడుతున్న సిద్దార్థ్ – హన్సిక

మళ్ళీ జతకడుతున్న సిద్దార్థ్ – హన్సిక

Published on Oct 26, 2012 3:25 PM IST


గతంలో వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో – సిద్దార్థ్ హన్సిక తొలిసారి జతకట్టారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం వీరిద్దరూ మళ్ళీ మరోసారి జతకడుతున్నారు. కుష్బూ సుందర్ నిర్మించనున్న ఈ సినిమాకి తమిళ్లో ‘తీయా వెలై సెయ్యనం కుమారు’ అనే టైటిల్ ని పెట్టారు ‘ చాలా కాలంగా సుందర్ గారితో పనిచెయ్యాలనుకుంటున్నాను. ఆ కోరిక ఇన్ని రోజులకి నెరవేరింది. అలాగే కమెడియన్ సంతానంతో కూడా కలిసి పనిచెయ్యాలనే కోరిక కూడా ఈ మూవీతో తీరనుంది. మరోసారి హన్సికతో కలిసి పనిచెయ్యనున్నాను. ఈ తమిళ సినిమాకి ‘తీయా వెలై సెయ్యనం కుమారు’ అనేది టైటిల్. సుందర్ గారికి నా కృతజ్ఞతలు అని’ సిద్దార్థ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇది కాకుండా సిద్దార్థ్ తన సొంత బ్యానర్ పై తనే హీరోగా రెండు సినిమాలను నిర్మించనున్నారు. ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

తాజా వార్తలు