‘సరిగమ పదనిస’ అంటున్న తనీష్

‘సరిగమ పదనిస’ అంటున్న తనీష్

Published on Oct 26, 2012 3:15 PM IST


విజయ దశమి రోజున సినిమా ముహుర్తంతో ప్రారంభమైతే సినిమా హిట్ అని కొందరు నిర్మాతలు నమ్ముతారు. ఈ సంవత్సరం విజయ దశమి రోజున చాలా సినిమాలు ముహూర్తం జరుపుకున్నాయి. అందులో ఒకటి ‘నువ్వు సరిగమ నేను పదనిస’. తనిష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అను, అపూర్వ కథానాయికలు. సూర్య కిరణ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈడ్పుగంటి శేషగిరి నిర్మిస్తున్నారు. ప్రేమ చుట్టూ తిరిగే ఈ సినిమాకి క్రిష్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు