పవన్ కళ్యాన్ సరసన సమంత.!

పవన్ కళ్యాన్ సరసన సమంత.!

Published on Oct 25, 2012 1:30 PM IST


‘జల్సా’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా నవంబర్లో లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కథానాయికగా ముందుగా ఇలియానా, ఇంకా పలువురిని సంప్రదించారు కానీ చివరికి ఆ అవకాశం చెన్నై ముద్దు గుమ్మ సమంతకి దక్కింది. సమంత ఈ సినిమాకి తన పూర్తి అంగీకారాన్ని తెలిపారు. ఇప్పటికే పలు పెద్ద హీరోలతో నటించి వరుస హిట్లు అందుకున్న సమంత, నటించిన హీరోలతో మళ్ళీ రెండవ సారి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సమంత పలు క్రేజీ సినిమాల్లో నటిస్తోంది మరియు ఆ సినిమాలన్నీ నవంబర్ మరియు డిసెంబర్లలోనే విడుదల కానుండడం విశేషం. ఇప్పుడున్న కథానాయికలు పవన్ కళ్యాన్ తో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని సమంత దక్కించుకుంది. పవన్ – త్రివిక్రమ్ – సమంత కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు