మంచి కారణం కోసం చెయ్యి కలుపుతున్న సమంత

మంచి కారణం కోసం చెయ్యి కలుపుతున్న సమంత

Published on Oct 27, 2012 6:07 PM IST

సమాజం కోసం సమంత ఏదయినా చెయ్యాలని తపిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఈ నటి పదే పదే సమాజ సేవలో పాల్గొంటూ వస్తుంది. హేమోఫిలియా సంస్థ కోసం ఫండ్స్ సేకరించిన సమంత ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే తను మరో గొప్ప కారణం కోసం పని చేస్తానని చెప్పింది. మంజుల,శైలేష్ మరియు పమేలా అనే ముగ్గరు వైద్యులు స్థాపించిన “ప్రత్యూష ఫౌండేషన్” కోసం తను పని చేయ్యనున్నట్టు సమంత తెలిపింది. ఈ సంస్థ మహిళల మరియు చిన్న పిల్లల అభివృద్ధి కోసం పని చెయ్యనుంది. ఈ విషయాన్నీ స్వయంగా సమంతనే ధృవీకరించింది. సమంత వంటి టాప్ హీరొయిన్ ఇటువంటి సేవా కార్యక్రమాలు చెయ్యడం చాలా మంచి పరిణామం ఈ విషయంలో ఆమెని అభినందించి తీరాల్సిందే. ఇలా సినిమా తారలందరు సామజిక స్పృహతో ముందుకు వస్తెహ్ చాలా బాగుంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” డబ్బింగ్ చెప్తుంది.

తాజా వార్తలు