పూరి తమ్ముడి ఆశలన్నీ ఆ సినిమాపైనే.!

పూరి తమ్ముడి ఆశలన్నీ ఆ సినిమాపైనే.!

Published on Oct 28, 2012 7:52 PM IST


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయం అయిన సాయిరాం శంకర్ ‘143’ మరియు ‘బంపర్ ఆఫర్’ సినిమాలతో హిట్ అందుకొని ఆ తర్వాత హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. సాయిరాం శంకర్ ‘నేనింతే’ సినిమాలో చేసిన పాత్రకి మంచి పేరు వచ్చింది. కొంత కాలం గ్యాప్ తర్వాత ‘యమహో యమః’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో శ్రీహరి యమధర్మ రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది.

ఈ వేడుకలో సాయిరాం శంకర్ మాట్లాడుతూ ‘ ఇప్పటివరకూ యమధర్మ రాజు మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇది కొత్తగా ఉంటుంది. అలాగే ఇది ఒక యమ భక్తుని కథ. యమధర్మ రాజుగా శ్రీహరి గారు చాలా బాగా నటించారు. ఈ చిత్ర నిర్మాతలకు సినిమాలంటే చాలా మక్కువ అందుకే మాకు యు.ఎస్ విసా సమస్య వచ్చినప్పటికీ, వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయత్నించగా 30 రోజులు యు.ఎస్ లో చిత్రీకరణ జరిపాము. మహతి మంచి సంగీతాన్ని అందించారు. తెలుగులో ఈ చిత్రం నాకు బ్రేక్ ఇస్తుందని’ ఆయన అన్నారు. పార్వతి మెల్టన్ మరియు సంజన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి మహతి సంగీతం అందించారు.

తాజా వార్తలు