అజయ్ – రిషిల యాక్షన్ ఎంటర్టైనర్

అజయ్ – రిషిల యాక్షన్ ఎంటర్టైనర్

Published on Oct 28, 2012 6:53 PM IST


రిషి, అజయ్, క్రాంతి మరియు ఐరా ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న లవ్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఈ రోజు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. టి. నాగరాజు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని జి.వి రెడ్డి నిర్మించనున్నారు. ఈ సినిమా మూవీ లాంచ్ వద్ద రిషి మాట్లాడుతూ ‘ ఇది నేను చాలా రోజుల తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా. ఈ సినిమాలో నేను ఒక కీలక పాత్ర పోషిస్తున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. రిషి ఇటీవలే విడుదలైన ‘ఎందుకంటే ప్రేమంట’ మరియు ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాల్లో కనిపించాడు. అజయ్ మరో కీలక పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో ‘మల్లెల తీరం’ ద్వారా తెరకు పరిచయం కానున్న క్రాంతి కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్లో ప్రారంభించి డిసెంబర్ కల్లా పూర్తి చేసి, జనవరి చివరి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు